భాజపా మెలిక పెట్టింది !

jairam rameshఎన్నికల దృష్ట్యానే రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను ఖండిస్తున్నానని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. 1969, 70లలో తెలంగాణ, జై ఆంధ్రా ఉద్యమాలు వచ్చాయని, ఈ క్రమంలో 2009 అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుపై వైఎస్ హామీ ఇచ్చారని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తాము పదేళ్ల పాటు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2013 జూన్‌లోనే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని, సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత అన్ని పార్టీల్లో విభజన వచ్చిందన్నారు. 2009 అసెంబ్లీలో వైఎస్ తెలంగాణ ఏర్పాటుపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ రాజ్యసభలో భాజపా మెలికపెట్టిందన్నారు. ఆర్టికల్ 3, 4 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల అప్పగింత రాజ్యాంగ బద్ధమేనన్నారు.