మోహన్ లాల్ తో రభస ?

ntr mohan lalజూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘రభస’. ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలకమైన రోల్‌లో కనిపించబోతున్నాడంటూ టాక్ నడుస్తోంది. సమ్మర్‌కు రాబోతున్న ఈ చిత్ర దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం మలయాళం హీరో మోహన్‌లాల్ ఇందులో కీలాక పాత్రల్లో కనిపించబోతున్నాడట. అంతే కాకుండా ఎన్టీఆర్‌కి, మోహన్‌లాల్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతుంది. నటీనటుల ఎంపిక చేసినప్పుడు కూడా మోహన్‌లాల్ పేరును దర్శకుడు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సివుంది. మరి ‘రభస’లో మోహన్‌లాల్ ఉన్నాడా లేదా అనే విషయం ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.