పోటుగాడు మ‌న‌సులో కోరిక‌

Manojమంచు క్యాంపులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు రాంగోపాల్‌వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఆయ‌న మోహ‌న్‌బాబు, విష్ణుల‌తో రౌడీ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్త‌వ‌గానే.. మ‌ళ్లీ మోహ‌న్‌ బాబుతో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయారు. అందులో విష్ణు ఉంటాడా? లేదా? అనేది స‌స్పెన్స్. అయితే మంచు మ‌నోజ్‌కి కూడా వ‌ర్మ సినిమాలో న‌టించాల‌నివుంద‌ట‌. త‌న మ‌న‌సులోని కోరిక ఇటీవ‌లే బ‌య‌ట‌పెట్టాడు. వ‌ర్మ సినిమాలో న‌టించాల‌ని అంద‌రికీ ఉంటుంది. అన్నయ్య‌కు ఆ ఛాన్స్ ద‌క్కింది. నాకూ అలాంటి అవ‌కాశం ద‌క్కితే బాగుణ్ణు. ఇప్పుడు కాక‌పోయినా.. ఎప్పుడైనా స‌రే.. వ‌ర్మ సినిమాలో న‌టిస్తా. చిన్న‌పాత్ర ఇచ్చినా సంతోషంగా చేస్తా.. అంటున్నాడీ పోటుగాడు. మ‌రి మ‌నోజ్ కోరిక వ‌ర్మ తీరుస్తాడా? త‌న త‌దుప‌రి చిత్రంలో మ‌నోజ్‌కి అవ‌కాశం ఇస్తాడా??