సోనియా మాటతప్పలేదు !

vhతెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి నుంచి వరంగల్ జిల్లాలో పర్యటన చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి.హనమంతరావు తెలిపారు. ప్రతి గ్రామంలో సోనియా గురించి ప్రచారం చేస్తామని చెప్పారు. అయితే, ప్రజలెక్కడివారైనా ఎవరికీ హానీ జరగకుండా రక్షించే బాధ్యత తమపై ఉందని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సోనియా ఎప్పుడూ మాట మార్చలేదని, అందరూ యూ-టర్న్ తీసుకున్నా ఆమె మాత్రం తెలంగాణ విషయంలో వెనక్కి పోలేదన్నారు.