ప‌వ‌న్ పాట‌ల‌పై ప‌డ్డాడు

pawan-kalyan(4)హ‌మ్మ‌య్య‌… మొత్తానికి ‘గ‌బ్బ‌ర్ సింగ్ 2’కి (పేరు ఇది కాదులెండి) కొబ్బ‌రికాయ్ కొట్టేశారు. ఇక రేపో మాపో హీరోయిన్‌ ని కూడా సెలెక్ట్ చేసేస్తారు. అంతా ఒకే. మ‌రి క‌థేది? అస‌లు క‌థే లేకుండా ఈసినిమాని ప‌ట్టాలెక్కించార‌ని టాక్‌. ముందు పాట‌లు తీసేసి, తీరిగ్గా స్టోరీపై కూర్చుందాం అని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ‘ఓమైగాడ్ రీమేక్‌’ లో ప‌వ‌న న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం, ఆ సినిమాకి శ‌ర‌త్ మ‌రార్ ఒకానొక నిర్మాత కావ‌డంతో గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ఎక్కువ‌య్యాయి. వాటికి పుల్‌ స్టాప్ పెట్ట‌డానికి హ‌డావుడిగా కొబ్బ‌రికాయ్ కొట్టేశారు. మ‌రి క‌థ మాట ఏంటంటారూ..? అందుకే ముందు పాట‌లు తీసి, ఆ త‌ర‌వాత టాకీ మొద‌లెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ప్లాన్. క‌థ లేకుండా పాట‌లెలా పుట్టాయ‌న్న‌ది ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. ‘గ‌బ్బ‌ర్ సింగ్ 2’ని దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేసిన పాట‌ల్ని… ఇప్పుడు కొత్త క‌థ‌కూ వాడేస్తార‌న్న‌మాట‌.