రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన.. !!

president-rule-in-apముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏవరూ.. ముందుకు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. గవర్నర్ రాష్ట్రపతికి అందించే నివేదికపైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి వుంది. అయితే, కేంద్రానికి గవర్నర్ ఈరోజే నివేదికను అందించాల్సి వున్నప్పటికినీ.. ఆయన వేచి చూసి ధోరణిలో వున్నట్లు సమాచారం. కాస్త వేచి చూసి రేపు గవర్నర్ కేంద్రానికి నివేదికను అందించనున్నారు.

మరోవైపు, ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమీటి భేటీ అయింది. ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా నేపథ్యంలో.. ఏం చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే, గవర్నర్ సుఫారు గానీ, కేంద్రం యోచన గానీ.. ఏపీలో రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపే విధంగా వున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఆందోళనలు, అవస్థలను చూసిన ఏపీ ప్రజలకు.. ముఖ్యమంత్రి కిరణ్ పుణ్యమా అని.. రాష్ట్రపతి పాలనను చూసే అవకాశం దక్కిందని పలువురు సైటైర్స్ వేస్తున్నారు………… !!