పవన్ కల్యాణ్ – వెంకటేష్ కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకొంటోంది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ఓమైగాడ్కి ఇది రీమేక్. అయితే ఈ చిత్రానికి దర్శకుడు విషయంలో ఇంత వరకూ క్లారిటీ లేదు. జయంత్ సి పరాన్జీ, తడాఖా దర్శకుడు డాలీల పేర్లు వినిపించాయి. అయితే ఫిక్స్ చేయాల్సింది మాత్రం పవన్ కల్యాణే. అయితే దర్శకుడు విషయంలో పవన్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసిందట. పవన్ ఓటు డాలీకే వేశాడట. దాంతో డాలీ చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లిపోయింది. తడాఖా తరవాత డాలీకి చాలా ఆఫర్లు వచ్చినా.. ఇప్పటి వరకూ ఏదీ పట్టాలెక్కలేదు. ఇంతకాలం ఎదురుచూసినందుకు ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోగలిగాడు. ఓమైగాడ్ని తెలుగు ప్రేక్షకులలు నచ్చేలా, పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా ఎలా డిజైన్ చేసుకొంటాడో చూడాలి.