లెజెండ్ ఆడియో కన్ఫర్మ్ !

Legendనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘లెజెండ్‌’. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం గీతాలను మార్చి 7న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా, అభిమానుల మధ్య విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, రాధికా అప్టే హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రమిది. దేవిశ్రీ ఈ ఆల్బమ్ గుర్తించుకొనేలా అదిరిపోయే మ్యూజిక్ సమకూర్చారట. అన్నట్టు.. చిత్రాన్ని ఏప్రిల్ నాలున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.