ఇవాళ కాదు.. రేపు ఆఖరు.. !!

kiran2ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. “ఇవాళ కాదు.. రేపు ఆఖరు” విలేకరులతో బుధవారం సీఎం అన్న వ్యాఖ్యలివి.  టీ-బిల్లు పార్లమెంట్ కు రాగానే రాజీనామా చేస్తానని సీఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నిన్న సీఎం చేసిన ’ఆఖరు’ మాట ప్రాధాన్యతను సంతరించుకొంది. విలేకరులు సీఎం అంతరార్థం కోసం ఏమిటి..??? సార్ అని కూపిలాగబోగా.. “అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగుస్తున్నాయి. అవికాగానే మీతో.. ఇష్టాగోష్టిగా మాట్లాడతా” అన్ని సెలవిచ్చారు. మరీ.. నేడు టీ-బిల్లు పార్లమెంట్ కు వచ్చే అవకాశాలున్నందున.. రాష్ట్రంలో సీఎం రాజీనామాపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇక కిరణ్ కు  సీఎంగా ఇవే చివరి క్షణాలేమో..