సభ్యులకు ’టీ’ ప్రతులు!!

t-bill4 (1)కేంద్రం విభజన బిల్లును రేపు (గురువారం) లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈమేరకు నిన్న జరిగిన లోక్ సభ బీఏసీ సమావేశంలో స్వీకర్ అనుమతిని కూడా తీసుకొంది. తాజాగా, బిల్లు ప్రతులను లోక్ సభ సచివాలయం ఎంపీలకు అందజేసింది. దీంతో.. బిల్లును లోక్ సభలో పెట్టే విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, బిల్లుకు భాజాపా మద్ధతును కూడగట్టేందుకు హస్తం నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. భాజాపా అగ్రనేతల చుట్టూ తిరుగుతూ వారి డిమాండ్లను పరిష్కరించి. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో తేనేటి విందుకు కూడా భాజాపా అగ్రనేతలను ఆహ్వానించారు.

టీ-బిల్లు రేపు లోక్ సభకు రానున్న నేపథ్యంలో.. హస్తినాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఎవరికి వారు తమ లాబీయింగ్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో.. రేపు లోక్ సభలోకి రానున్న టీ-బిల్లుకు ఆమోదం లభిస్తందా.. ? లేదా.. ? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.