జేపీ చొక్కా పట్టుకొన్నారు !

jpలోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయనపై దాడి జరిగితే, ఈ సారి తెలంగాణ న్యాయవాదులు ఆయన చొక్కా పట్టుకున్నారు. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్రమంలో పోలీసులు కల్పించుకోవడంతో ఆయన టై వారి చేతిలో పడింది. దీంతో టైను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకొని స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రీక్తపర్థిస్థితులు నెలకొన్నాయి.