నేడే సభకు టీ-బిల్లు.. ??

t-bill4రాష్ట్ర విభజన అంశం అత్యంత కీలక దశకు చేరుకుంది. ఏ క్షణమైన టీ-బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టవచ్చు. ఇప్పటికే బిల్లును సిఫార్లు కోసం పీఓఎం రాష్ట్రపతికి పంపించింది. అక్కడి నుంచి రావడమే ఆలస్యం… చటుక్కున పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం రెడీగా వున్నట్లు తెలుస్తోంది.

విభజన బిల్లుకు ఈరోజు (సోమవారం) రాష్ట్రపతి ఆమోదం పొందనుంది. బిల్లును రేపు రాజ్యసభ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోగా.. భాజాపా మద్ధతును కూడగట్టేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ వ్యూహ కర్తలు. రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీల సంఖ్య తక్కువగా వుండటం చేత.. మొదటగా టీ-బిల్లును పెద్దల సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.

అన్నీ కుదిరితే.. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నమే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి ఈ వారం అత్యంత కీలకంగా మారనుంది. వారం రోజుల్లోనే ఆంధ్ర ప్రదేష్ భవిష్యత్ తేలనుంది. వారం తరవాత… ఖుషిగా ఫీలవుతున్నది సీమాంధ్ర ప్రజలా..? తెలంగాణ ప్రజలా.. ?? లేక రాష్ట్ర ప్రజలా..??? తేలనుంది. సో.. వెయిట్ అండ్ సీ……..