మోహన్ బాబుని ‘రౌడి’ చేశాడు

mohan babuదర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనే. ఆయన చిత్రాలు, ఆ చిత్రానికి పెట్టె టైటిల్స్ అన్ని టాక్ అఫ్ ది టౌన్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు వర్మ మరో ఆసక్తి కరమైన టైటిల్ ను ప్రకటించారు. ఇందులో ఏకంగా ‘పెదరాయుడు’ మోహన్ బాబు ను రౌడి ని చేశారు. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు వర్మ, మోహన్ బాబు, విష్ణు కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా ‘రౌడి’ని ఫైనల్ చేశాడు వర్మ. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వుండటం తో ఇప్పుడు ఆ ‘రౌడి’ ఎవరన్నది ఆసక్తిగా మారింది.