కొత్త పార్టీ ఏర్పాటుకు టైం లేదా.. !!

lagadapatiముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న విషయం
తెలిసిందే. కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటులో.. విజయ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రులు గంటా, శైలాజ నాథ్ లు కీలక భూమిక పోషిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా, కొత్త పార్టీపై ఎంపీ లగడపాటి స్పందించారు.

కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు.. ఇప్పుడు తగినంత సమయం లేదని లగడపాటి అంటున్నారు. అయితే, పార్లమెంట్ లో టీ-బిల్లును అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. లగడపాటి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. కొత్త పార్టీకి టైం లేదు.. అంటే పార్టీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గనాంగం సుముఖంగా వున్నట్లే కదా.. ! అని నేతలు గుసగుసలాడుతున్నారు.

లగడపాటి వ్యాఖ్యలతో ఒక్కటి మాత్రం స్పష్టమైంది. కిరణ్ కొత్త పార్టీ పెట్టబోయే ఆలోచనలు వున్నట్టు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి, అసెంబ్లీ ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడినట్లయితే.. కిరణ్ కొత్త పార్టీ పురుడుపోసుకోవచ్చన్న మాట. అదేలా అంటారా.. ? అప్పుడు కావాల్సినంత సమయం వుంటుంది కదా.. !