లగడపాటిని కిందకు లాగేశారు !

lagadapatiఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద ఏపీఎన్జీవోలు చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా లగడపాటిని తెలంగాణ విద్యార్థి సంఘం నేత బండి ప్రకాష్ స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో లగడపాటి స్టేజి మీద నుంచి కిందకు పడిపోయారు. ఊహించని పరిణామంతో ఏపీ ఎన్జీవో, రాజకీయ నేతలు నిచేష్టులుగా వుండిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చి ప్రకాష్‌ని స్టేషన్‌కు తరలించారు.