బాహుబ‌లి త‌ర‌వాతే పెళ్లి!

prabhash2014లో ప్రభాస్ సినిమాలేమీ రావ‌డం లేదు. అయితే 2015లో మాత్రం అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా ఇచ్చేస్తున్నాడు ప్రభాస్‌. ఎందుకంటే ఆ యేడాది బాహుబ‌లి విడుద‌ల అవుతుంది. అంతేకాదు.. ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును… ప్రభాస్ వ‌చ్చే యేడాది ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సంగ‌తి కృష్ణంరాజు అధికారికంగా ప్రక‌టించారు. ప్రభాస్ త్వర‌లోనే పెళ్లిచేసుకొంటాడు. బాహుబ‌లి షూటింగ్ వ‌ల్ల‌… ఆ శుభ‌కార్యం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. 2015లో బాహుబ‌లి విడుద‌ల‌, ప్రభాస్ పెళ్లి ఒకేసారి జ‌రుగుతాయి. నేనే ద‌గ్గరుండి జ‌రుపుతా… అని అభిమానుల‌కు మాటిచ్చారు కృష్ణంరాజు.