బాలయ్య ఫిక్స్ అయ్యాడు !

ballayaనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లెజెండ్‌’ చిత్ర విడుదల తేది ఖరారైంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, రాధికా అప్టే హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. ఇక సింహా ‘వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంభినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.