రజనీ బాటలో ఎన్టీఆర్

ntrరజనీకాంత్‌ ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో భారీ క్రేజ్‌ ఉన్న సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరో. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజనీకి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా జపాన్‌ లాంటి దేశాల్లో రజనీకి ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ కూడా వెలిశాయి. అదే రజనీ స్టామినా.

అయితే ఇప్పుడు ఇదే బాటలో జపాన్‌ లో ఫాలోయింగ్‌ సాదిస్తున్నాడు మన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ చేస్తున్న డ్యాన్స్‌ జపాన్‌ వాసులకు తెగ నచ్చేస్తున్నాయట. అక్కడి నిర్వహిస్తున్న కొన్ని పబ్లిక్‌ ఫంక్షన్లలో కూడా ఎన్టీఆర్‌ పాటలకు డ్యాన్స్‌లు కూడా చేస్తున్నారట. ఈ ఫాలోయింగ్‌ చూసిన జపాన్‌ సినీ వర్గాలు ఎన్టీఆర్‌ సినిమాలను అక్కడ రిలీజ్‌ చేసే ఆలోచన కూడా ఉన్నారన్న టాక్‌ వినిపిస్తుందే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఇటీవల కాలం చేసిన సినిమాలకు జపాన్‌ మంచి క్రేజ్‌ ఉందని భావిస్తున్నారు అక్కడి నిర్మాతలు..

ఇప్పటికే ఈ విషయం మీద కొంత మంది నిర్మాతలను కూడా సంప్రదించారట.. ఇప్పటికే బాద్‌షా సినిమాను అక్కడ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా.. స్టూడెంట్‌ నెంబర్‌ 1, సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాల డబ్బింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారట..

టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉన్న ఎన్టీఆర్‌.. ఇలా ఓవర్‌సీస్‌ మార్కెట్‌ కూడా మరింత విస్తరించుకుంటే టాప్‌ ప్లేస్‌కి బెస్ట్‌ కాంపిటీటర్‌ అవ్వడం కాయం అంటున్నారు ఫ్యాన్స్‌.