మ్యూజికల్ ‘హార్ట్ఎటాక్’ !

nithదర్శకుడు పూరి జగన్నాధ్ నితిన్ కాంబినేషన్ లో వస్తున్నా తాజగా చిత్రం ‘హార్ట్ఎటాక్’. అదా శర్మ హీరోయిన్. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే మహేష్, చరణ్ లు సంక్రాతి రేసులో వుండడంతో థియేటర్ల కొరత వస్తుందని జనవరి 31 కి సిద్దం చేశారు. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఆడియో ను ఈ రోజు  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేస్తున్నారు. నితిన్, అనూప్ లది హిట్ కాంబినేషన్. గతం లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్, గుండె జారే. ..చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరి ‘హార్ట్ఎటాక్’ పాటల ఎలా ఉంటాయో వినాలి.