హరీష్ రావు, జూపల్లి అరెస్ట్

hటీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావులను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్న రాయదుర్గ్ గేమింగ్ యానిమేషన్ పార్కు ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించేందుకు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.