అక్కినేనికి అస్వస్థత!

akkineni
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో.. ప్రముఖ కార్పోరేట్ వైద్యులు ఆయన నివాసనికే వచ్చి వైద్యం అందిస్తున్నారు. గతకొంత కాలంగా ఆయన క్యాన్సర్ తో బాథపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయనకు శత్ర చికిత్స కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అక్కినేని అస్వస్థతకు గురికావడంతో.. ఆయన కుమారుడు నాగార్జునతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం అక్కినేనితోనే గడుపుతున్నారు. కాగా, అక్కినేని ఆరోగ్య పరిస్థితిని వివరించడానికి ఆయన కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యతో కలసి నటించిన చిత్రం విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.