టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ… ‘1’

mahesh oneసాంకేతికంగా `1` సినిమాని హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దామంటున్నాయి `1` చిత్ర వ‌ర్గాలు. ఈనెల 10న వ‌న్ విడుద‌ల కాబోతోంది. సోమ‌వారం ఈ చిత్రానికి సెన్సార్ కార్య‌క్రమాలు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం `1` నిర్మాత‌లు పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అనిల్ సుంక‌ర‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట మాట్లాడారు. “మేం అనుకొన్నట్టే సినిమా చాలా బాగా వ‌చ్చింది. తెలుగు తెర‌పై ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని టెక్నిక‌ల్ ఎఫెక్ట్ ఈ సినిమాకి పెట్టాం. టాలీవుడ్‌లో ఓ హాలీవుడ్ మూవీ చూసిన‌ట్టు ఉంటుంది. ఫ్రెంచ్, స్పానిష్, జ‌ప‌నీస్‌, కొరియ‌న్ భాష‌ల్లో ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నాం. క‌థానాయ‌కుడిగా మ‌హేష్ బాబు స్థాయిని మ‌రింత పెంచే చిత్రం అవుతుంది. 14 రీల్స్ బ్యాన‌ర్‌లో ఇది నెంబ‌ర్ `1` చిత్రం అవుతుంద‌న్న న‌మ్మకం ఉంద‌“న్నారు.