దాసరి నారాయణరావు, మోహన్ బాబులది గురుశిష్యుల అనుబంధం. ఇద్దరూ కలసి నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఇంత కాలానికి ఓ సినిమాలో నటించారు. అదే ’పాండవులు పాండవులు తుమ్మెద’. ఈ సినిమాలో మోహన్ బాబుకి మావయ్యలా, రవినాఠాండన్ కి నాన్నలా దాసరి నటించారట. దాసరి మాట తీరు కూడా విభిన్నంగా ఉంటుందని సమాచారమ్. ఆయన తమిళ యాసలో మాట్లాడతారట. దాసరి పాత్ర వినోదాన్ని పంచిపెడుతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ’పాండవులు పాండవులు తుమ్మెద’ ఆడియో ఈనెల 11న విడుదల కానుంది. జనవరి 31న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.