కిరణ్ ’కొత్త పార్టీ’ పెట్టడం లేదట!!

cm kiran new partyముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య బ్యాటింగ్ చేశారు. ఈరోజు (శనివారం) అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం సీఎం విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. టీ-బిల్లుపై అసెంబ్లీలో ఇంకా చర్చ ప్రారంభం కాలేదని అన్నారు. అయితే, విభజన బిల్లుపై సోమవారం నుంచి చర్చ ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్టు కిరణ్ తెలిపారు.

టీ-బిల్లుపై ఓటింగ్ జరకుండా.. అభిప్రాయాలు చెప్పాలనడం హాస్యాస్పదం సీఎం అన్నారు. దేశంలో ఓటింగ్ లేకుండా ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా అని కిరణ్ ప్రశ్నించార్. ఇక, గతకొద్ది కాలంగా ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడుతున్నారని వస్తొన్న వార్తలపై.. కిరణ్ స్పందించారు. తాను కొత్తపార్టీ పెట్టడం లేదని.. కొత్త పార్టీపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలో పుట్టానన్న కిరణ్.. భవిష్యత్ పై ఇంకా.. నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి.. ముఖ్యమంత్రి.. మరోసారి అధిష్టానానికి ధిక్కార స్వరాన్ని వినిపించడంతో పాటు, సమైక్యవాదులను ఆకట్టుకునేలా మాట్లాడారు.