ముఖ్యమంత్రి వల్లే.. శ్రీధర్ బాబు ఫోకస్.. ?

cm-kiran-sridhar-babu

మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నేలేపింది. రాజకీయ నేతలు పార్టీల పరంగా కాకుండా… ప్రాంతాల పరంగా చీలిపోవడం మరోసారి స్పష్టంగా కనిపించేలా చేసింది ఈ ఘటన. సీఎం వైఖరికి నిరసనగా శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఇక, టీ-నేతలు అయితే.. సీఎంను చిత్ర, విచిత్ర పదజాలంతో కడిగేశారు. ఎంపీ పొన్నం ఏకంగా సీఎం హెలిక్యాప్టర్ ను పేల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ విషయంలో సీఎం కు సీమాంధ్ర ఎంపీల నుంచి కాస్త తక్కువ మద్దతు లబించిందనే చెప్పాలి.

తాజాగా, ఈ శాఖమార్పు ఘటనపై మరోకోణం బయటపడింది. అందరూ.. అనుకుంటున్నట్లుగా కిరణ్ కోపంతో శ్రీధర్ బాబు శాఖను మార్చలేదట. ఆయనపై వున్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు అనుకుంటున్నారట. అదేలా అనుకుంటున్నారా.. ? అదేనండీ.. ఇప్పటి వరకూ తెలంగాణలో సీనియర్ అండ్ సీఎం రేస్ లో వున్న నేతలు ఎవరంటే.. టక్కున.. జైల్ పాల్ రెడ్డి, జానారెడ్డి, డీఎస్, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తదితరుల పేర్లు మాత్రమే వినిపించేవే. సరిగ్గా.. ఇదే విషయంపై కిరణ్ కన్నెశారట. టీ-నేతల్లో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న వీరందరికీ చెక్ పెట్టాలనే యోచనతోనే.. కిరణ్ కరెక్ట్ టైమ్ చూసి శ్రీధర్ బాబు శాఖ మార్చారట. దీంతో.. శ్రీధర్ బాబు ’టీ’లో మరింత ఫోకస్ అవడం గ్యారెంటీ అని సీఎం వర్గాలు
భావిస్తున్నాయి.

ఈ వార్తలను బలపర్చే అంశాలు కూడా కనబడుతున్నాయి. సీఎం.. శ్రీధర్ బాబు శాఖను మార్చి.. ఆ శాఖ అదనపు బాధ్యతలను మంత్రి శైలాజానాథ్ కు అప్పగించారు. అనంతరం శైలాజానాథ్ స్వయంగా శ్రీధర్ బాబు తో సమావేశమయ్యారు. అంతేకాకుండా.. శ్రీధర్ బాబు రాజీనామా లేఖ మీకు అందిందా.. ? అని నిన్ని ముఖ్యమంత్రిని విలేకరులు అడగగా.. ’ప్రేమలేఖ’నా.. ఇంక అందలేదని కిరణ్ ఆనందపడ్డారు. ఈ పరిణామాలను గమనిస్తే.. కిరణ్ ప్రేమతోనే శ్రీధర్ బాబు శాఖ మార్చారన్న వార్తలను కొట్టిపారేలేం. మరీ.. శ్రీధర్ బాబును ప్రేమించాల్సిన అవసరం ముఖ్యమంత్రికేం వచ్చింది.. ? అసలు శాఖ మార్పు ప్రేమతోనే జరిగిందా.. ? అనే విషయాలు తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.. !