నెంబర్ ‘వన్’ రికార్డ్

maheshమహేష్ ‘1’ మరో సరి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వన్ తాజా థియేటర్ ట్రైలర్ యూ ట్యూబ్ లో కొత్త రికార్డు నెలకొల్పింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 5 లక్షల వ్యూస్ దాటాయి. తెలుగు సినిమాలకు సంబంధించి ఇది కొత్త రికార్డని అంటున్నారు. ట్రైలర్స్‌ లో యాక్షన్‌ అంశాలన్నీ హాలీవుడ్‌ టేకింగ్‌లో ఉండటమే కాకుండా, చిత్రీకరించిన దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నాకు కావాల్సింది తెలిసిన కథ కాదు.. తెలియని కథ’ అంటూ ఓ థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ‘వన్’ కు ఈ రోజు సెన్సార్ జరనున్నట్లు సమాచారం.