మరోసారి ప్రధాని కావాలని లేదు : మన్మోహన్

pmప్రధాని మన్మోహన్ ముచ్చటగా మూడోసారి పూర్తి స్థాయి మీడియా సమావేశం నిర్వహించారు. అందరు భావించినట్లుగానే యూపీఏ1, యూపీఏ2 సాధించిన ఘన కార్యాలయాలను ప్రసావించారు. మరోసారి యూపీఏ అధికారంలోకి వచ్చినా.. ప్రధాని పదవిని స్వీకరించనని మన్మోహన్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తానని అన్నారు. అయితే, రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడని.. సరైన సమయంలో.. యూపీఏ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని అధినేత్రి సోనియా గాంధీ చెప్పారని ఆయన చెప్పకొచ్చారు.

గతంలో కంటే.. గ్రామీణ వేతనాలు పెరిగాయని ప్రధాని ప్రస్తావించారు. ఇక, ధరల పెరుగుదల వల్ల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మా చేతుల్లో లేని అంశాల వల్ల ధరలు పెరిగాయని ప్రధాని అనడం విశేషం. అయితే, భారతదేశ భవిష్యత్ ను రాబోయే తరం నేతలు నిర్ధారిస్తారని అన్నారు. కాగా, మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. యూపీఏ అభివృద్ధిని ప్రస్తావించిన మన్మోహన్.. యూపీఏ అవినీతిని ప్రస్తావించక పోవడం విశేషం. పాత్రికేయ మిత్రులు ఇంకా ప్రధానిని పలు ప్రశ్నలు అడిగుతున్నారు.