చేయి చేసుకొన్న మోహ‌న్‌బాబు!

mohan babuకలెక్షన్ కింగ్ మోహ‌న్‌ బాబు డైలాగ్ కింగ్ కూడా. ఏ డైలాగ్‌ ని ఎక్కడ నొక్కాలో, ఎక్కడ సాగ‌దీయాలో తెలిసిన వ్యక్తి. నంద‌మూరి తార‌క రామారావు త‌ర‌వాత‌…. ఆ స్థాయిలో భీకరంగా డైలాగులు వ‌ల్లించే మ‌రో న‌టుడు.. మోహ‌న్‌బాబు మాత్రమే అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. డైలాగులు చెప్పడ‌మే కాదు, రాయ‌డంలోనూ త‌న‌కు ప్రవేశం ఉంద‌ని… చాటి చెప్పే ప్రయ‌త్నం చేస్తున్నారు. అవును… మోహ‌న్ బాబు సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా మారారు. ‘పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద’ సినిమా కోసం. మంచు ఫ్యామిలీ న‌టిస్తున్న చిత్రమిది. మోహ‌న్‌బాబు, విష్ణు, మ‌నోజ్ క‌థానాయ‌కులు. శ్రీ‌వాస్ ద‌ర్శకుడు. ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాల‌కు మోహ‌న్‌బాబు సంభాష‌ణ‌లు అందించారు. ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబు కూడా దృవీక‌రించారు. మ‌రి ఆ డైలాగులు ఏ రేంజులో పేల‌తాయో, క‌లెక్షన్ కింగ్‌లో ఉన్న ర‌చ‌యిత ఏ మేర‌కు విజృంభిస్తాడో చూడాలి.