’బాహుబలి’కి బ్రేక్.. !

bahubali’బాహుబలి’ షూటింగ్ కు రెండు రోజుల పాటు బ్రేక్ ని ప్రకటించారు దర్శకుడు రాజమౌళి. మళ్ళీ తిరిగి జనవరి 2 నుంచి షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ కంటిన్యూగా 50 రోజులు జరగనుంది. ప్రభాస్, రానా ఇద్దరూ ఈ వార్ సీక్వెన్స్ లో పాల్గొననున్నారు. దాదాపు 2000మందితో.. రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన ఓ భారీ వార్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు గారి సమర్పణలో ఆర్కా మీడియా నిర్మిస్తుంది. సంగీతం ఎంఎం కీరవాణి.