చర్చ తో పాటు ఓటింగూ జరగాలి: లగడపాటి

lagadapatiశాశన సభలో విభజన బిల్లు పై చర్చ తో పాటు ఓటింగ్ జగగాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఏపీ జర్నలిస్టుల ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్య ఉద్యమం పెట్టుబడిదారుల నుంచి పుట్టిందంటూ తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారని, ప్రస్తుతం కోట్లాది మంది ప్రజలు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నారని, వీరంతా పెట్టుబడిదారులా? అని ప్రశ్నించారు. తెలుగు తల్లి గర్భం నుంచి సమైక్య ఉద్యమం పుట్టిందని తెలిపారు. ప్రజలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరుతుగున్న అన్యాయంపై ప్రజాపోరాటం వెల్లువెత్తిందని చెప్పారు. రాజకీయ వ్యవస్థపై ఆగ్రహంతోనే సీమాంధ్ర ప్రజలు పోరాట బాట పట్టారని తెలిపారు.

మరో కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ సబ్బం హరి మాట్లాడుతూ.. నిజమైన సమైక్యవాది ఎవరో తెలియని పరిస్థితుల్లో సమైక్య ఉద్యమం నడుస్తోందని చెప్పారు. నిజమైన సమైక్యవాది ఎవరో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోందని విమర్శిస్తోంది.