ప‌వ‌న్ పెళ్లాం గ్రూప్ డాన్సరా?

pavan2సంచ‌ల‌నాలు సృష్టించ‌డం అల‌వాటు చేసుకొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌… నిజ జీవితంలోనూ అదే బాట ప‌ట్టాడు. ఒక‌టి కాదు రెండు కాదు… ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని తీన్ మార్ ఆడేశాడు. తీన్ మార్‌లో ఓ క‌థానాయిక‌గా న‌టించిన డ‌నామార్స్ తో ప‌వ‌న్ స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని గ‌త కొంత‌కాలంగా మీడియా కోడై కూస్తోంది. అయితే రిజిస్టర్ ఆఫీసులో న‌మోదైన పేరు మాత్రం అన్నాలెజినోవా. డానామార్స్‌, అన్నాలెజినోవా ఇద్దరూ ఒక‌టేనా, వేర్వేరా..? అనేది ఎవ్వరికీ తెలియ‌డం లేదు. కొంత‌మంది ప‌వ‌న్ మూడో పెళ్లాం తీన్‌మార్‌లో న‌టించిన డానానే అంటున్నారు. ఇంకొంద‌రు… ఆ అమ్మాయి కాదు… లెజీనోవా వేరు, ఆమె తీన్ మార్‌లో ఓ గ్రూప్ డాన్సర్ గా క‌నిపించింది అని చెబుతున్నారు. రిజిస్టర్ ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఫొటోలు కూడా తేడానే. అన్నా కాస్త బొద్దుగా క‌నిపిస్తోంది. డానా మార్స్ అయితే మ‌హా స్లిమ్‌! పేరూ, రూపం వేర్వేరుగా ఉండ‌డంతో మీడియా త‌ల‌లు ప‌ట్టుకొంటోంది.

pawan-kalyan-Anna-Lezhnevaఅయితే,  పవన్ సన్నిహితుల్లో ఈ పెళ్లి, పెళ్లి కూతురు వ్యవహారంలో ఓ క్లారీటి వుంది.  పవన్ సన్నిహితులు మాత్రం డానామార్స్‌, అన్నాలెజినోవా వేరు వేరు అని తేల్చేస్తున్నారు. పవన్ పెళ్లి చేసుకున్నది అన్నాలెజినోవాను అన్నది పవన్ సన్నిహితుల మాట.