కాంగ్రెస్ కు ఒక్కసీటు కూడా రాదు..!

congressఅవసరమున్నా.. లేకున్నా పనిగట్టుకొని అధిష్టానం జపం చేసే కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ను ఏకిపారేస్తున్నారు. ఇందులో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒకరు. కరుడుగట్టిన సమైక్యవాదిగా గుర్తుపొందిన లగడపాటి.. ఆది నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూనే వున్నారు. ఏకంగా సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మాణం ఇవ్వడంలో లగడపాటి పాత్ర కీలమైందన్న విషయం తెలిసిందే.

తాజాగా, లగడపాటి మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన చివరి అంకానికి చేరిందన్న ఆయన… అసెంబ్లీ లో తీర్మాణం చేయకుండా విభజన సాధ్యం కాదని అన్నారు. ఇక, రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకపోతే.. 70మంది ఎమ్మెల్యేలు,  12ఎంపీలు కాంగ్రెస్ వీడనున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లగడపాటి
మద్దతు పలకడం విశేషం. పన్నెండు మంది ఎంపీల్లో లగడపాటి కూడా వున్నారా.. అని అప్పుడే టీ-ఎంపీలు సైటైర్స్ వేస్తున్నారు.