జంప్ జిలానీ’ లా లిస్టు రెడీగా వుంది !

botsaపార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినా , హైకమాండ్ నాయకత్వాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు విలేఖరుల సమావేశం మాట్లాడుతూ… ఉసరవెల్లి రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. పక్క పార్టీల వైపు చూసేవారి జాబితా పీసీసీ దగ్గర ఉందని తెలిపారు. మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం గురించి చెబుతూ … జేసీ దివాకర్ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేసీకి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అయితే నోటీసులు అందలేదని అంటున్నారని, అందుకే ఆయనకు మళ్లీ నోటీసులు పంపిస్తామని బొత్స తెలిపారు.

అన్ని పార్టీలు ఏదో ఒక దశలో,ఏదో ఒక రూపంలో, ఒక దృక్పదంతో విభజన కోరినమాట అందరికి తెలుసనని అన్నారు. అయితే సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని కొంతమంది చూస్తున్నారని విమర్శించారు. విభజనకు అన్ని పార్టీలు కారణమేనని అందుకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నవారికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.