‘1’ లో.. సుకుమార్ ’సూపర్ స్క్రీన్ ప్లే’.. !!

1-Nenokkadineప్రిన్స్ మహేష్ ‘1-నేనొక్కడినే’ సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయింది. జనవరి 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం.. ‘1’ టీం రాత్రి-పగలు పనిచేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్స్, ఆడియో రికార్డ్స్ ను సృష్టిస్తున్నాయి. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదే.. సుకుమార్ సూపర్ స్ర్కీన్ ప్లే. అవునూ.. ఈ చిత్రంలో సుకుమార్ తన ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల కట్టిపడనేయనున్నాడని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ విషయం తెలసిన మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. మహేష్ మానియాకు.. సుకుమార్ సూపర్ స్రీన్ ప్లే తోడైతే.. ఇక రికార్డ్స్ బద్దలేనని సంబరపడిపోతున్నారు. మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సంగీతాన్ని అందించాడు.