29న ముఖ్యమంత్రిగా క్రేజివాల్ ప్రమాణం!!

kejriwal1ఢిల్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు చేపట్టేందుకు ’ఆమ్ ఆద్మీ పార్టీ’ సిద్దమైంది. ఈనెల 29వ తేదిన క్రేజివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ నెల 26న ప్రమాణ స్వీకార కార్యక్రమం వుంటుందని.. భావించనప్పటికినీ.. అది కాస్త ఈనెల 29కి వాయిదా పడింది. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రెండు రోజుల కిందట పంపిన ప్రతిపాదనకు తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది.