’ఓదార్పు’ను వదిలేది లేదు.. !!

jagan1వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్న జగన అక్కడి నుంచి నేరుగా చిత్తూరు జిల్లా పలమనేరు మీదుగా ఓదార్పు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం.. కోర్టు అనుమతిని కోరారు. ఒకవేళ కోర్టు ఓకే అంటే.. జగన్ ’ఓదార్పుయాత్ర’ మళ్లీ షురు అయినట్లే.

అసలు ’ఓదార్పు యాత్ర’ లక్ష్యం ఏమిటి.. ? అంటే.. దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం. ఇది బాగానే వుంది. మనల్ని నమ్ముకున్న వారికి.. మనమున్నామనే భరోసా కల్పించడంలో తప్పులేదేమో.. ! అయితే, ఓదార్పు యాత్ర పేరుతో.. ’ఎన్నికల యాత్ర’ చేయడం ఎంతవరకు సమంజసం. ఎన్నికల యాత్ర అని ఎందుకన్నానంటే.. ఓదార్పు యాత్రలో సమైక్య ఆవశ్యకతను జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

jagan2జగన్ నిజంగానే వైఎస్ ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిన కుటుంబాలను పరామర్శించాలని భావించినా.. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పరిస్థితుల దృష్ట్యా.. సమైక్య ప్రసంగాలు చేయడం రాజకీయనేతలకు అనివార్యంగా పరణమించింది. అందులోనూ.. జగన్ ఊరేగింపుతో.. ఓదార్పుకు బయలుదేరుతాడాయే. ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన్నా.. సమైక్య వాదులను ఆకట్టుకునే పలుకులు పలికే ముఖ్యమంత్రి కిరణ్ వ్యవ్యహారం లాంటిదే..ప్రస్తుత జగన్ ఓదార్పు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

JAGAN3

వచ్చే సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేనందునా.. మరోసారి సెంటిమెంట్ అస్త్రంలో భాగంగానే జగన్ ఓదార్పు యాత్రను శ్రీకారం చుట్టారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు.. ’ఓదార్పు’, మరోవైపు ’సమైక్య శంఖారావం’ వంటి కార్యక్రమాలతో.. సీమాంధ్రలో దూసుకుపోవాలన్నది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ రెండు సెంటిమెంట్లతో.. ‘టార్గెట్2014’ సిద్దమవుతున్నారు వైస్ జగన్. మరీ.. జగన్ టార్గెట్ ను రీచ్ అవుతారా… ? ఆయన సెంటిమెంట్ అస్త్రాలు ఫలిస్తాయా.. ? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి..