కరుణానిధి ’నమో..’ జపం!!

modi-karunanidhiతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మోడీని ప్రశంసలతో ముంచెత్తాడు. పాలకుడిగా మోడీ..  తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారని, తన (గుజరాత్) రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటారని కరుణానిధి అన్నారు. మోడీని ఆయన చక్కటి వ్యక్తిగా అభివర్ణించారు. కురవ్రుద్దుడు మోడీపై నాలుగు మంచి మాటలు చెప్పాడో.. లేదో అప్పుడే భాజాపాతో డీఎంకే జతకట్టనుందనే.. ఊహాగానాలు రాజకీయవర్గాలో మొదలయ్యాయి.

యూపీఏ ప్రభుత్వం రెండు సార్లు కొలువుదీరడంలో కీలక పాత్ర పోషించిన డీఎంకే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో కమలనాథులతో కలవడానికి రెడీగా వుందట. అందులో భాగంగానే నెట్ ప్రాక్టీస్ లాంటి నాలుగు మంచి మాటలు వదిలాడని రాజకీయవర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతానికి 2జీ స్కాములో డీఎంకే ఎంపీలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. డీఎంకే స్నేహ హస్తాన్ని కమల నాథులు స్వీకరిస్తారా.. ? లేదా.. ? అన్నది ప్రశ్నార్థకమే. అందులోనూ.. తమిళనాట అధికారంలో వున్న అన్నా డీఎంకే అధినేత్రి జయలలితతో మోడీకి మంచి సంబంధాలున్నాయి.

మొత్తానికి.. కరుణానిధి మాటలు కమల నాథుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, హస్తం పార్టీలో అలజడికి దారితీస్తున్నాయి. మరీ.. నిజంగానే డీఎంకే, భాజాపా దోస్తీ కట్టనున్నాయా.. ? అంటే..సమాధానం మాత్రం మరో మూడు నెలలు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఎన్నికలు జరిగేది అప్పుడే కదా.. !