ఏకపక్షంగా వాయిదా వేస్తారా?

t-leadersఅసెంబ్లీ సమావేశాల్ని వాయిదావేయడంపై  తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. సభ వాయిదాకు నిరసనగా.. సభా వాయిదా పడిన అనంతరం బయటికి రాకుండా లోపలే వుండి నిరసన తెలియజేశారు. తెదేపా తెలంగాణపోరం, తెరాస, భాజాపా నేతలు ఈ నిరసనలు పాల్గొన్నారు. విభజన బిల్లుపై చర్చించకుండా సభను ఏకపక్షంగా వాయిదా వేశారని టీ-నేతలు ఆరోపించారు. వెంటనే సభను సమావేశపర్చి, బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, గురువారం వాయిదాపడిన సభ తిరిగి జనవరి 3న కొలువుదీరనుంది.