22న ‘భీమవరం’లో ‘బుల్లోడి’ ఆడియో

beemavaram bullodaసునీల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమవరం బుల్లోడు’.  1000 అబద్ధాలు చిత్రం ఫేమ్ ‘ఎస్తేర్’ హీరోయిన్. ఉదయశంకర్ దర్శకుడు. సునీల్ కి  ‘పూల రంగడు’ వంటి మ్యూజికల్ హిట్ అందించిన అనూప్ రూబెన్స్ మరో సారి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సునీల్ సొంతూరు భీమవరంలో ఈనెల 22 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు సునీల్ కు అత్యంత ఆప్తమిత్రుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరౌతారని సమాచారం. సునీల్, త్రివిక్రమ్ చదువుకున్న భీమవరం డి.యన్,అర్.కాలేజీ మైదానం లోనే ఈ ఆడియో వేడుక జరగనుంది.