రామ్ చరణ్ సినిమా ఎవడు సంక్రాంతికి వాయిదా పడింది. అయితే జనవరి 12న ఈ సినిమా రావట్లేదట. దానికంటే ముందో, ఆ తరవాతో వచ్చే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. జనవరి 10న మహేష్ బాబు 1 రావడం ఖాయం. రెండు రోజుల వ్యవధిలో ఎవడు రిలీజ్ చేయడం రిస్క్ అని దిల్ రాజు భావిస్తున్నాడు. కనీసం మహేష్ సినిమాకీ, చరణ్ సినిమాకీ వారం రోజుల గ్యాప్ అయినా ఉండాల్సిందే. ఎందుకంటే థియేటర్లు లేవు. ఓ సిటీలో పది థియేటర్లుంటే కనీసం ఎనిమిది థియేటర్లు మహేష్ నిర్మాతలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నారు. ‘ఎవడు’కు థియేటర్లు దొరకడం గగనం అయిపోయింది. అందుకే వీలైతే మహేష్ సినిమా కంటే ముందొచ్చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. అంటే.. సంక్రాంతి సందడి ముందే మొదలైపోతుందన్నమాట.