సీక్వెల్ పై కన్నేశాడు !

vijayవిజయ్ నటించిన ‘జిల్లా’ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై వుంది. అర్. టి నేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘జిల్లా’ సెట్స్ పై ఉండగానే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు విజయ్. తన ‘తుపాకీ’ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 2012 లో వచ్చిన ఈ ‘తుపాకీ’ తెలుగు , తమిళం లో బాగానే పేలింది. ఇక సీక్వెల్ కూడా ‘తుపాకి’ దర్శకత్వం వహించిన మురుగదాస్ దర్శకత్వంలోనే రూపొందునుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను దర్శకుడు మురుగదాస్ పూర్తి చేశాడు. జనవరి రెండో వారంలో ఈ చిత్రం సెట్స్ పై కి వెళ్ళనుందని సమాచారం.