టీ-జేఏసీ నేతలకు బంపర్ ఆఫర్.. !

t-jac-leadersతెలంగాణ జేఏసీ నేతలు నక్కతోక తొక్కారు. వారిపై బంపర్ ఆఫర్ల వర్షం కురుస్తోంది. పార్టీలు పోటీ పడి మరీ వారికి ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ చదరంగంలో గెలుపు గుర్రాలు ఎవరైనా వున్నారంటే.. టక్కున టీ-జేఏసీ నేతల పేర్లు చెప్పడమే ఇందుకు కారణమట.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీ-జేఏసీ నేతలకు టికెట్ ఇవ్వడం ద్వారా.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారికి గౌరవం ఇచ్చినట్లు వుంటుందని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. తమ పార్టీ అకౌంట్ లో గెలుపు గుర్రాల జాబితా మరింత పెరుగుతోందన్నది తెరాస ప్లాన్. ఇక, అధికార కాంగ్రెస్ ది దాదాపు ఇదే పంథా అయినప్పటికినీ.. తెలంగాణలో తెరాసను ఎదుర్కోవాలంటే.. టీ-జేఏసీ నేతలకు మించిన మంచి ఆప్షన్ ఆ పార్టీకి ఇంకొంకటి లేదు.

మొత్తానికి తెరాస, కాంగ్రెస్ లో పోటీపడి మరీ..టీ-జేఏసీ నేతలకు గాలం వేస్తున్నాయి. మరీ.. పార్టీల గాలంలో చిక్కుకునే జేఏసీ నేతలెందరు అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే, టీ-జేఏసీ నేతల్లో కొందరు ఆఫర్ పై త్వరపడుతుండగా.. మరికొందరు మాత్రం అప్పుడే పాలిటిక్స్ వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీల ఫోకస్ తో.. టీ-జేఏసీ నేతలు ’వుందిలే ముందు ముందు మంచికాలం.. ’ అని ఓ పాటేసుకుంటున్నారన్న మాట.