ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. ?

ఢిల్లీలో అధికారం ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై సంధిగ్ధత నెలకొంది. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై మీమాంస తొలగడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఆమ్ ఆద్మీలు విముఖత చూపాయి. దీంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వని పక్షంలో రాష్ట్రపతి పాలన దిశగా పరిస్థితులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా త్రిముఖ పోరులో ఏ పార్టీకి సరిపడేంత మెజార్టీ రాకపోవడంతో ఢిల్లీలో హంగ్‌ ఏర్పడింది.

appకొత్తగా వచ్చి అనూహ్యంగా 28సీట్లను గెలుచు కున్న ఆమాద్మీ పార్టీ అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి మద్దతిచ్చేది లేదని తేల్చింది.

harsh vardhaఇదే సమయంలో మొదటి స్థానంలో ఉన్న బీజేపీ కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పడంతో ఢిల్లీ పరిస్థితి రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోంది.

delhi-polls-2013మరోవైపు, లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అత్యదిక స్థానాల్లో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించగా అందుకు ఆ పార్టీ నేత హర్షవర్దన్‌ తమకు మెజారిటీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ తర్వాత స్థానంలో నిలిచిన ఆమ్‌ఆద్మీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్ట్‌ నెంట్ గవర్నర్‌ ఆహ్వానించారు. దీనికి ఆమ్‌ ఆద్మీ అధినేత కేజ్రీవాల్‌ కూడా విముకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Pranab-Mukherjeeకొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అది సాధ్యం కాని పక్షంలో వచ్చే రాష్ట్రపతి పాలన వల్ల ఎదురయ్యే పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి, రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన వస్తే అధికారులదే ప్రధానపాత్ర ఉండనుండటంతో ముందస్తుగా నజీబ్‌ జంగ్‌ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఢిల్లీ సస్పెన్స్‌కు తెరవీడటం లేదు. ఏ పార్టైనా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందో తెలియన ఢిల్లీవాసులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఈ ఢిల్లీ సస్పెన్స్‌తో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియన నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వాసులకు ఇప్పటికే నీటి కష్టాలు మొదలయ్యాయి. చివరికి ఈ పరిస్థితి ఎలా సర్దుమనుగుతుందో చూడాలి.