అభిప్రాయమా.. ? ఓటింగా.. ?

Telangana bill yet to reach Andhra Pradesh Assemblyరాష్ట్ర విభజన విషయంలో మరో ప్రధాన ఘట్టానికి తెరలేచింది. సీను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మారింది. ’ఆంధ్రపదేశ్ పునర్విభజన బిల్లు-2013′ ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం చెప్పడానికి జనవరి 23వరకు రాష్ట్రపతి గడువిస్తూ.. ఏపీ అసెంబ్లీకి పంపారు. ఇది నిన్న సాయంత్రం 6.10కి రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది.

ముసాయిదా బిల్లులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో మొదటిది – రాజ్యాంగంలోని మూడవ అధికరణాన్ని అనుసరించి జనవరి 23వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయాలు కోరండి. రెండవది – దానితోపాటే, బిల్లులో ప్రస్తావించిన క్లాజ్‌ ల వారీగా అభిప్రాయాలు తీసుకోండి. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి (కల్డ్ ఔట్) జనవరి 26వ తేదీలోగా ఢిల్లీకి పంపండి.

దేశంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల విభజన విషయంలో.. శాసనసభలు బిల్లుపై దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. మరీ….. టీ-బిల్లుపై ఏకాభిప్రాయం సాధ్యమా.. ? అనేది ప్రశ్నార్థకమే. విభజన బిల్లుపై అభిప్రాయానికే పరిమితమవుతుందా.. ? లేక ఓటింగ్ కూడా జరుగుతుందా.. ? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, బిల్లుపై అభిప్రాయం చాలని టీ-నేతలు అంటుండగా, లేదు ఓటింగ్ జరగాల్సిందేనని సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో.. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.