కొత్త టాలెంట్ ని ఒడిసి పట్టుకొని సక్సెస్ కొట్టడంతో దిల్ రాజు తరవాతే ఎవరైనా. అయితే అతి కొద్దిసార్లే ఈ నమ్మకం ఒమ్ము అయ్యింది. వేణు శ్రీరామ్ తన తొలి సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే చేశాడు. ‘ఓ మై ఫ్రెండ్’ తీసింది ఆయనే. కానీ ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. అయినా సరే… వేణు శ్రీరామ్ పై నమ్మకం ఉంచాడు దిల్ రాజు. మరోసారి అవకాశం ఇచ్చాడు. వేణు చెప్పిన కథ నచ్చడంతో… ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్. వేణు చెప్పిన కథకు… స్టార్ హీరోల అవసరం ఉంది. అందుకే ఓ మెగా హీరోని దిల్ రాజు బుక్ చేసినట్టు సమాచారమ్. మెగా హీరో అంటే చరణ్, బన్నీ, సాయిధరమ్ తేజలలో ఒకరు ఖాయం అయ్యారని తెలిసింది. మరి ఆ హీరో ఎవరనేది సస్పెన్స్!