‘ఢిల్లీ’పై డైలమానే.. !

kejriwalvsHarshavardhan-370x338ఢిల్లీ రాష్ట్రంలో కొలువుదీరాల్సిన నూతన ప్రభుత్వంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజాపా, రెండో స్థానంలో నిలచిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు కూడా ప్రతిపక్షంలోనే
కూర్చునేందుకు రెడీగా వున్నాయి. ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అవసరమే మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా వున్నాయి.

మళ్లీ ఎన్నికలకు :
తాము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించబోమని.. అవసరమైతే మళ్లీ ఎన్నికలకు సిద్ధమని భాజాపా ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ వెల్లడించారు. దీనికి.. దీటుగా ఆమ్ ఆద్మీ అధినేత క్రేజివాల్ సైతం తాము రీ ఎలక్షన్స్ కి సిద్ధమని పేర్కొన్నారు. కావాలంటే.. భాజపా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని క్రేజివాల్ సూచించాడు. దీంతో.. ఢిల్లీపై డైలామా ఇంకా కొనసాగుతూనే వుంది. అయితే, రీ ఎలక్షన్ జరిగినట్లయితే.. ప్రధాన పోటీ భాజాపా, ఆమ్ మధ్య వుండబోతోంది. కాగా, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీకి 32, ఆప్ 28, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.