ఎన్టీఆర్ కు ఆ సెంటిమెంట్ కుదురుతుందా ?

ntrజూనియర్ ఎన్టీఆర్‌కి ఈమధ్య కాలం కలసి రావడం లేదు. సినిమాలు ఊహించని ఫలితం ఇవ్వకపోవటం తో ఒక్కసారిగా డీలా పడ్డాడు. అయితే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు…. అందుకే రీసెంట్‌ మూవీపైనే దృష్టి పెట్టాడు. ఇందుకోసం ఓ సెంటిమెంట్‌ కూడా ఫాలో అవుతానంటున్నాడు. ఏంటి ఆ సెంటిమెంట్ అంటారా ?

ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న ‘ఆది’, ‘సింహాద్రి’ చిత్రాల విడుదల తేదిల్లో తన కొత్త చిత్రాన్ని విడుదల చేసి అదే రేంజ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు జూనియర్. ఈ ఏడాది ఎన్టీఆర్‌ నటించిన తొలి చిత్రం ‘బాద్‌ షా’ని ‘ఆది’ విడుదల తేదీ మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. అనివార్యకారణాలతో ఓ వారం తేడాతో ఏప్రిల్‌ 5న చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేశారు. అయితే ఆ చిత్రం యావరేజ్‌గానే నిలిచింది. ఇక హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామయ్యా వస్తావయ్య’ చిత్రం కూడా మొదట్లో సింహాద్రి విడుదల తేదీ అయిన జులై 9న రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావించింది. ఆ తరువాత స్టూడెంట్‌ నెం.1 రిలీజైన సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలనుకున్నారు. అది కుదరకపోవడంతో చివరాఖరికి అక్టోబర్‌ 11న విడుదల చేశారు. ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మనోడు డైలామాలో పడ్డాడు.

ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని కంకణం కట్టుకున్నాడు అందుకే తన లేటెస్ట్‌ మూవీ ‘రభస’ని ‘ఆది’ విడుదల తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. మరీ జూనియర్ కు ఈ సెంటిమెంట్‌ కుదురుతుందో లేదో చూడాలి.