చిరు.. చిన్న ప్రయత్నం.. !!

Chiranjeeviకేంద్ర కేబినేట్ నిర్ణయంపై గుర్రుగా వున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి లు ఈరోజు (శుక్రవారం) ఉదయం భాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అయితే, విభజన నివేదికలో.. తాము నివేదించుకున్న ఏ విషయాన్ని కూడా తమ అధిష్టానం లెక్కలోనికి తీసుకోలేదని తీవ్ర ఆగ్రహంతో వున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు విభజనను ఆపడానికి ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే వెంకయ్య నాయుడితో మంతనాలు జరిపినట్లు రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

విభజన ఆపడం లేదా ఆలస్యం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క భాజపాకే సాధ్యమన్నది సీమాంధ్ర కేంద్ర మంత్రుల భావన. అందువలన సీమాంధ్ర ప్రాంతానికే చెందిన వెంకయ్య నాయుడు సమాలోచనలకు తెరలేపారు. పైగా సమైక్యాంద్రకు కాస్త కూస్తో మద్దతు పలికిన వాడిలో వెంకయ్య నాయుడు కూడా ఒకరు. సీమాంధ్ర పజల సమస్యలను, సందేహాల నివృత్తి పేరుతో పార్లమెంట్ లో టీ-బిల్లును అడ్డుకోవడం
లేదా ఆలస్యం చేయాలని భాజాపాను చిరు చిన్నగా కోరడనే వార్తాలు వస్తోన్నాయి.

సొంత పార్టీకి చెందిన అధిష్టాన పెద్దలే.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను పెడచెవిన పెట్టారు. మరీ.. వీరు కోర్కెలను భాజపా ఎంతవరకు పరిగణలోని తీసుకుంటున్నది ప్రశార్థకమే. మరీ.. చిరు చేసిన చిన్న ప్రయత్నం ఎలాంటి ఫలితానిస్తుందో వేచి చూడలి..