”కోట్లకు కోట్లు సంపాదించాలని ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. నా అభిరుచికీ, ఇష్టానికీ ఇక్కడ ప్రాధాన్యం ఉంటుందనే వచ్చా. కాబట్టి ఎప్పుడూ నా మనసు పారితోషికం మీద ఉండదు” అంటోంది అమలాపాల్. తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది అమలాపాల్. బాలీవుడ్లో ఆఫర్ వచ్చినా వదులుకొంది. కారణం అడిగితే ”హాయిగా బతికేయడం నాకిష్టం. గందరగోళాలు నచ్చవు. తెలుగు తమిళం అంటూ రెండు చోట్లా.. బిజీగా ఉన్నా. ఇప్పుడు కొత్త బాధ్యత మోయడానికి సిద్ధం గాలేదు. హిందీలో నటించాలని ఉంది. అయితే.. ఆ కథ వింటున్నప్పుడు ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లొనూ వదులుకోకూడదు అనేలా కథ ఉండాలి. బాలీవుడ్లో ఎంత పారితోషికం వస్తుంది. ఎంత ప్రచారం సంపాదించుకోవచ్చు అనేవి తరవాతి సంగతులు. కథ నచ్చితేనే సినిమా ఒప్పుకొంటా” అని చెబుతోంది.