టీ-జేఏసీ మౌన దీక్ష!

tjac Mouna deekshaతెలంగాణలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. మొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ వాదులు ఇప్పుడు రాయల తెలంగాణ వద్దు.. తెలంగాణనే ముద్దు అనే నినాదంతో నిరసనలు మొదలెట్టారు. జీవోఎం రాయల ’టీ’ని రెడీ చేసిందని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. దీనికి నిరసన టీ-జేఏసీ ఢిల్లీలో ఈరోజు మౌన దీక్షను చేపట్టారు. రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

మొదటి నుంచి హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న టీ-జేఏసీ, బీజేపీ, తెరాసలు మళ్లీ ఉద్యమ కార్యచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ’రాయల తెలంగాణ’ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన వెలువడటమే తరువాయి.. తెలంగాణ మళ్లీ ఉద్యమ సెగలు ఎగసిపడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమాచారం.

ఇప్పటికే కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. వందరోజుల్లో హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..ఆ పార్టీ రాయల ’టీ’ అంగీకరించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.ఏదేమైనా.. గతకొద్ది కాలంగా కాస్త ప్రశాతంగా వున్న తెలంగాణలో.. రాయల ’టీ’ ప్రతిపాదన మళ్లీ ఉద్యమాలకు నాంది పలికేలా వుందని రాజకీయ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.